నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. సదాశివపేట పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
'నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు'
సంగారెడ్డి జిల్లాలో కొద్ది రోజులగా నకిలీ విత్తనాల దందా కలకలం రేపుతోంది. అధిక దిగుబడి ఆశ చూపి రైతులను మోసం చేస్తోన్న దళారుల దందాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సదాశివపేట పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులతో కలిసి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
fake seeds
రైతులు.. కొనుగోలుకు ముందు నాణ్యమైన విత్తనాలను గుర్తించాలని ఎస్పీ సూచించారు. ప్రభుత్వం గుర్తించిన షాపుల్లోనే విత్తనాలు కొనాలంటూ.. విక్రయాలకు సంబంధించిన సరైన రశీదులు తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:యూట్యూబ్లో చూసి నకిలీ నోట్ల తయారీ.. దంపతుల అరెస్ట్