Insecticide in the rice the young woman eats: వరంగల్ జిల్లాలోని సంగెం మండలం గవిచర్లకు చెందిన యాదగిరి అనే వ్యక్తి తమకు కూలి పనికి రాకుండా వేరే వారి వద్దకు పనికి వెళ్లిందన్న అక్కసుతో సదరు యువతి మధ్యాహ్నం తినే భోజనంలో పురుగుల మందు కలిపాడు. ఆహారం తినే సమయంలో దుర్వాసన రావడం గుర్తించిన ఆ యువతి యాదగిరిని నిలదీసింది.
యువతి తినే అన్నంలో పురుగుల మందు.. చివరికి..! - వరంగల్ జిల్లా తాజా వార్తలు
Insecticide in the rice the young woman eats: పత్తి ఏరేందుకు రాన్నందుకు ఓ యువతి తినే అన్నంలో పురుగుల మందు కలిపిన ఘటన వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆహారం తినే సమయంలో దుర్వాసన రావడం గుర్తించిన ఆ యువతి వ్యక్తిని నిలదీసింది.
ఈ క్రమంలో ఇద్దరికి తీవ్ర వాగ్వివాదం జరగగా ఆ యువతి తనను చంపేందుకు ప్రయత్నించాడని, కులం పేరుతో దూషించాడని సంగెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మామునూరు ఏసీపీ ఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. కొందరు గ్రామ ప్రజల వాగ్మూలంతో యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాదగిరిపై హత్యాయత్నం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితురాలికి, యాదగిరికి ఆరేళ్లుగా పరిచయం ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
ఇవీ చదవండి: