Inhuman Incident: సికింద్రాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలోని అంజనాపురి కాలనీలో అమానుషం జరిగింది. 4 నెలల పిండాన్ని (మృత శిశువు)ను కాలనీలో పెద్దకొండ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. వీధికుక్కలు కాలనీలో పిండాన్ని పట్టుకుని తిరుగుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు... వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పిండాన్ని ఎవరు పడేసి వెళ్లారని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మృత శిశువును చుట్టుపక్కల వాళ్లు పడేశారా? లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చి పడేశారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు.. మృత శిశువును గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Inhuman Incident: అమానుషం.. రోడ్డుపై నాలుగు నెలల పిండం... - Telangana news
Inhuman Incident: సికింద్రాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలో అమానుషం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 4 నెలల పిండాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది.

అల్వాల్