తెలంగాణ

telangana

ETV Bharat / crime

Baby Dead Body: చెత్తకుప్పలో పసికందు మృతదేహం లభ్యం - telangana top news

infant-body-found-in-a-dumpster-in-nizamabad
నిజామాబాద్‌లో చెత్తకుప్పలో పసికందు మృతదేహం

By

Published : Aug 21, 2021, 8:33 AM IST

Updated : Aug 21, 2021, 12:07 PM IST

08:32 August 21

ప్రైవేటు ఆస్పత్రి వద్ద పసికందు మృతదేహం గుర్తింపు

చెత్తకుప్పలో పసికందు మృతదేహం లభ్యం

        నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను ఓ తల్లి చెత్తకుప్పలో పారేసింది. ముళ్లకంపలో పడిన ఆ చిన్నారి ఒళ్లంతా రక్తసిక్తమై ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గుర్తించిన మున్సిపల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. 

ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరైంది...

         బోధన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఇంటర్ రెండో సంవత్సరం చుదువుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఓ అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటాననే ఉద్దేశంతో అతనికి శారీరకంగా దగ్గరైంది. బాలిక కొంత కాలంగా తరచూ అనారోగ్యానికి గురవడంతో.. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమె గర్భవతని చెప్పడంతో తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ఎలాగైనా సరే తమ బిడ్డకు గర్భస్రావం చేయమని బతిమాలారు. అప్పటికే నెలల నిండడంతో... గర్భస్రావం చేయడం కుదరదని వైద్యులు తేల్చి చెప్పారు. 

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది..

          ఇక చేసేదేం లేక బాలికను తీసుకొని ఇంటికెళ్లిపోయారు. విషయం తెలిస్తే.. అందరి ముందు పరువు పోతుందని భావించిన ఆ తల్లిదండ్రులు... బాలిక కడుపులో కణతి అయిందని చెప్పారు. అందువల్లే కడుపు పెరుగుతుందని వివరించారు. నిన్న రాత్రి పురిటి నొప్పులు రావడంతో... నిజామాబాద్​ ఖలీల్​వాడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ రోజు ఉదయం ఆ బాలిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన వెంటనే... ఆమె తల్లిదండ్రులు బాబును స్థానికంగా ఉన్న చెత్తకుప్పలో పడేసి పారిపోయారు. 

ముళ్లకంపపై పడి... ప్రాణాలు కోల్పోయిన శిశువు

           బాబు ముళ్లకంపపై పడడంతో... ఒళ్లంతా గాయలయ్యాయి. లేత శరీరంలోకి ముళ్లు గునపాల్లా దిగాయి. ఆ చిన్నారి ఆయువును తీసేశాయి. విషయం గుర్తించిన మున్సిపల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు శిశువు మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్త స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాబు స్థానిక ఆస్పత్రిలోనే జన్మించినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఇందుకు సంబంధించి శిశువు తల్లిని, ఆమె తల్లిదండ్రులను విచారించారు. తమకేం తెలీదని.. ఆ బాబు తమ బాబు కాడంటూ వారు చెప్పడంతో... సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చూడండి:TALIBAN: తాలిబన్ల చెరలో నెల్లూరు వాసులు..18 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే !

Last Updated : Aug 21, 2021, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details