తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2021, 4:54 PM IST

ETV Bharat / crime

ACCIDENT: ఔటర్​ రింగ్​రోడ్డుపై భారీ గ్యాస్​ ట్యాంకర్​ బోల్తా

హైదరాబాద్​ శివారు బాహ్యవలయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్యాస్​ ట్యాంకర్​ అదుపుతప్పి బోల్తాపడింది. భారీ ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఔటర్​ రింగ్​రోడ్డుపై భారీ గ్యాస్​ ట్యాంకర్​ బోల్తా
ఔటర్​ రింగ్​రోడ్డుపై భారీ గ్యాస్​ ట్యాంకర్​ బోల్తా

హైదరాబాద్ శివారు ఔటర్​ రింగ్​రోడ్డుపై ఓ భారీ ఇండియన్​ గ్యాస్​ ట్యాంకర్ బోల్తా పడింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్​స్టేషన్​ పరిధిలోని రావిర్యాల బాహ్యవలయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఘటనలో వాహనంలోని డ్రైవర్​, క్లీనర్​ సురక్షితంగా బయటపడ్డారు. చర్లపల్లి నుంచి తిమ్మాపూర్​కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనాలను దారి మళ్లించి.. ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు. రావిర్యాల, బెంగళూరు టోల్​గేట్ల వద్ద వాహనాలను ఒకేదారి మీదుగా పంపిస్తున్నారు. మరోవైపు ట్రక్ భారీ పరిమాణంలో ఉండటం.. అందులో ఎల్​పీజీ గ్యాస్​ ఉండటంతో.. దాన్ని జాగ్రత్తగా పైకి లేపేందుకు భారీ క్రేన్లను రప్పిస్తున్నారు. ఇప్పటికే ఇండియల్ ఆయిల్ అధికారులకు సమాచారమిచ్చారు. వాళ్ల సాయంతో ట్రక్​ను రహదారిపై నుంచి పక్కకు తీసేందుకు సమాలోచనలు చేస్తున్నారు.

తప్పిన పెను ప్రమాదం

భారీ ట్యాంకర్ కావడం అందులోనూ గ్యాస్​తో నిండి ఉండటంతో.. వాహనదారులు భయపడ్డారు. ప్రమాదంలో అది పేలి ఉంటే.. జరిగే నష్టం ఊహించుకోవడమే కష్టం. అయినా ట్యాంకర్​లో ఎలాంటి లీకేజ్​ లేకపోవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:ATTACK: భూవివాదంలో గొడ్డలి, కొడవళ్లతో దాడిచేసుకొన్న అన్నదమ్ములు

ABOUT THE AUTHOR

...view details