జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో.. ముగ్గురు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. బత్తుల రామయ్య అనే వ్యక్తి అపార్ట్‌మెంట్ నిర్మాణం అనుమతుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. రూ. లక్ష లంచం ఇస్తేనే అనుమతులు వచ్చేలా చూస్తామని టౌన్‌ప్లానింగ్ అధికారులు డిమాండ్ చేశారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారులు - three municipal employees took bribes and insisted to the ACB
ముగ్గురు మున్సిపల్ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు. వారిని అదుపులోకి తీసుకుని.. బుధవారం రోజున కోర్టులో ప్రవేశపెడుతామని ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారులు
బాధితుడు ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డిని ఆశ్రయించటంతో.. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలోనే రూ. 95 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ముగ్గురు ఉద్యోగులను పట్టుకున్నారు. వీరిలో టీపీఎస్ బాలనందస్వామి, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి రాము, సివిల్ ఇంజినీర్ నాగరాజు ఉన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని.. బుధవారం రోజున కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:భారత్‌లో చైనా కంపెనీలపై కేంద్రం ప్రకటన