రెండో పెళ్లి పేరుతో సైబర్ నేరగాళ్లు (CYBER CRIME) భారీ మోసానికి తెగపడ్డారు. రూ. 50 లక్షలను ఓ మహిళ వద్ద కాజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకుంది. కొన్ని రోజుల తరువాత తనకు ఓ ఫోన్ వచ్చింది. 'తాను ఇటలీలో డాక్టర్‌నని, క్లినిక్ కూడా ఉందన్నాడు. మాట్రిమోనీ సైట్లో ప్రొఫైల్ చూశానని... మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లోనే స్థిరపడదామని కేటుగాడు ముగ్గులోకి లాగాడు.
కొన్ని రోజుల తరువాత ఇటలీలో ఉన్న తన ఖరీదైన వస్తువులు ఎయిర్ కొరియర్ ద్వారా పంపిస్తున్నానని నమ్మించాడు. పథకం ప్రకారం ఓ మహిళ చేత దిల్లీ కస్టమ్స్ అధికారినంటూ ఫోన్ చేయించాడు. వస్తువుల కోసం టాక్స్‌లు చెల్లింపు పేరుతో రూ.50 లక్షలను కేటుగాడు బదిలీ చేయించుకున్నాడు. తరువాత ఫోన్ చేయగా అటువైపు నుంచి సమాధానం రాలేదు. చివరికి మోసపోయినని తెలుసుకున్న ఆ మహిళ... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.