తెలంగాణ

telangana

ETV Bharat / crime

Harassment: 9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష - verdict in pocso case

imprisonment-for-a-maid-who-sexually-abused-a-9-year-old-boy
imprisonment-for-a-maid-who-sexually-abused-a-9-year-old-boy

By

Published : Sep 16, 2021, 7:54 PM IST

Updated : Sep 16, 2021, 8:44 PM IST

19:47 September 16

బాలుడిని వేధించిన ఆయాకు 20ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానా

ప్రస్తుతం రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల పాశవిక ఘటనలు వెలుగుచూస్తున్న ఈ క్రమంలో.. నాలుగేళ్ల కింద జరిగిన ఓ విభిన్నమైన ఘటనలో కోర్టు తీర్పు వెలువరించింది. సైదాబాద్​లో ఆరేళ్ల చిన్నారిని అత్యంత కర్కశంగా హత్యాచారం చేసిన కామాంధున్ని ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్ తీవ్రంగా వెల్లువెత్తిన తరుణంలో.. నిందితుని ఆత్మహత్యతో ప్రజాగ్రహం చల్లారింది. అదే తరుణంలో... అందుకు భిన్నంగా.. ఓ బాలునికి జరిగిన మరో ఘటనలో ఎట్టకేలకు తీర్పు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

సిగరెట్​తో కాల్చి..

హైదరాబాద్​ పాతబస్తీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలుడిని లైంగికంగా వేధించిన ఆయాకు ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. బార్కాస్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో జ్యోతి అనే పాతికేళ్ల మహిళ.. 2017లో ఆయాగా చేరింది. ఆ ఏడాది నవంబర్ 20న బాధిత బాలుడు మూత్రశాలకు వెళ్లిన సమయంలో ఆ వెనుకే వెళ్లిన జ్యోతి... బాలుడి మర్మాంగాలను పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టింది. మళ్లీ అదే నెల 30న కూడా జ్యోతి అలాగే ప్రవర్తించి బాలున్ని వేధించింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బాలుని ఒంటిపై సిగరెట్​తో కాల్చింది. శరీరంపై సిగరెట్ వాతను గమనించిన తండ్రి ఏమి జరిగిందని వాకబు చేశాడు. బాలుడు భయపడుతూ జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించాడు. 

నాలుగేళ్ల తర్వాత...

బాలుడి తండ్రి 2017 డిసెంబర్‌లో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోక్సో కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. న్యాయస్థానంలో సాక్ష్యాధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన కోర్టు.. నాలుగేళ్ల విచారణ అనంతరం ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ... తీర్పు వెల్లడించింది.

ఇదీ చూడండి:

Last Updated : Sep 16, 2021, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details