తెలంగాణ

telangana

ETV Bharat / crime

అక్రమంగా తరలిస్తోన్న తెలంగాణ మద్యం పట్టివేత.. ఇద్దరి అరెస్ట్​ - telangana liquor in ap

ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తోన్న తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

తెలంగాణ మద్యం పట్టివేత
తెలంగాణ మద్యం పట్టివేత

By

Published : Apr 13, 2021, 8:51 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాలోని జొన్నలగడ్డ గ్రామం వద్ద పోలీసులు ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా.. విజయవాడకు చెందిన యశోదరావు అనే వ్యక్తి వద్ద తెలంగాణ మద్యం లభ్యమైంది. మద్యాన్ని స్వాధీనం చేసుకుని.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లా అసండ్రతండా సమీపంలో వాహనంలో తరలిస్తున్న 1008 బాటిళ్ల తెలంగాణా మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. మద్యం బాటిళ్ల విలువ రెండు లక్షలకు పైనే ఉంటుందని తెలిపారు. పెదకూరపాడుకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:భద్రాచలంలో 20 కేజీల గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details