లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వచేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు బెల్ట్ షాప్ నిర్వాహకులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలోని ఒకే ప్రాంతంలో సుమారు పదికిపైగా మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు నిర్వాహకులు యాదగిరి, ప్రసాద్ అక్రమంగా మద్యం అమ్ముతుండంతో వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 55 మద్యం సీసాలు, 12 బీర్లు, 30 కల్లు ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని వారిని దుండిగల్ పోలీసులకు అప్పగించారు.
అక్రమంగా మద్యం విక్రయం.. నిందితులు అరెస్ట్ - అక్రమ మద్యం పట్టివేత
అక్రమంగా మద్యం నిల్వచేసి అధిక ధరలకు విక్రయిస్తున్న బెల్ట్ షాపు నిర్వాహకులను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం పట్టివేత
జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని దేవమ్మ బస్తీకి చెందిన గణేష్.. అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నాడు. దాడులు చేసిన పోలీసులు, అతడి వద్ద నుంచి 111 మద్యం సీసాలు, 12 బీర్లు స్వాధీనం చేసుకున్నారు. బస్తీల్లో అధిక సంఖ్యలో మద్యం దుకాణాలు వెలవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.