వరంగల్ అర్బన్ జిల్లా మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నాణ్యత లేకుండా అమ్ముతున్న 432 లీటర్ల శానిటైజర్, ఖాళీ సీసాలను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన ఐదుగురిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
నాణ్యత లేని శానిటైజర్లు స్వాధీనం.. అదుపులో నిందితులు - మట్టెవాడలో నాణ్యత లేని శానిటైజర్లు స్వాధీనం
నాణ్యత లేకుండా తయారుచేసిన శానిటైజర్లను విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. శానిటైజర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జేపీఎన్ రోడ్, జెమిని థియేటర్ లైన్లలో 5 షాపులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఆ షాపుల్లో నాణ్యత లేని శానిటైజర్లను క్యాన్లలో నుంచి ఖాళీ స్ప్రే బాటిళ్లలో నింపుతుండగా పట్టుకున్నారు. డబ్ల్యూహెచ్ఓ నియమాలను పాటించకుండా వాటిని తయారుచేసి అమ్ముతున్నట్లుగా పోలీసులు తెలిపారు. వాటిని బయట అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం