ఇసుక నుంచి తైలం తీయడం నానుడి.. నీటి నుంచి ఇసుక తీయడం నేటి పద్ధతి.. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నది ఇసుకాసురులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే నీళ్లు లేని చోట ఇసుకను తవ్వేసిన అక్రమార్కులు.. ఇప్పుడు ఏకంగా నీటిలోంచి ఇసుకను తీసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఏమాత్రం భయం లేకుండా నదిలోనే ఇసుకను జల్లెడపట్టి గుళకరాళ్లను అక్కడే వదిలేస్తున్నారు.
నదిలో నీరున్నా ఇసుక తవ్వకం.. అధికారుల నిర్లక్ష్యం - తెలంగాణ తాజా వార్తలు
రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుక దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. నీరున్నా ఇసుక తీయడం మానడం లేదు. అధికారులు మామూలు తీసుకుంటూ వారిని వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతీ రోజు సుమారు వంద ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఇప్పటికే భూగర్బజలాలలు తగ్గిపోవటంతో నీటి నిలువలు లేకుండా పోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని డొల్లార గ్రామ సమీపంలోని నది పరివాహకంలో అంతరరాష్ట్ర వారధి సాక్షిగా ఈ దందా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మరోవైపు సహజవనరులను కాపాడాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి:'ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి... కరోనాను దరిచేరనీయకండి'