తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన: అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత - అంబాల గ్రామశివారుతో ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా కమలాపూర్​ ఎస్సై ఆధ్వర్యంలో అంబాల గ్రామశివారులో తనిఖీలు నిర్వహించారు. ఈటీవీభారత్​లో 'దోచేస్తున్నారు' అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై స్పందించిన పోలీసులు చర్యలు చేపట్టారు.

illegal sand tractors caught by police in marripalligudem village kamalapur mandal in warangal urban district
అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

By

Published : Jan 21, 2021, 6:04 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కమలాపూర్​ మండలం మర్రిపల్లిగూడెం వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 14 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. చెరువులు, వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా దందాపై 'దోచేస్తున్నారు' అనే శీర్షీకన ఈటీవీభారత్​లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన పోలీసు యంత్రాంగం మండలంలోని అంబాల గ్రామశివారులో వాహనాల తనిఖీలను చేపట్టారు.

ఇసుక అక్రమంగా తరలించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అనంతరం వాటిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. తదుపరి చర్యల కోసం వాటిని తహసీల్దార్‌కు అప్పగించనున్నట్లు ఎస్సై పరమేశ్వర్‌ స్పష్టంచేశారు.

ఇదీ చూడండి :'కిలాడీ దంపతులు.. చిట్టీల మోసంలో ఆరితేరారు!

ABOUT THE AUTHOR

...view details