తెలంగాణ

telangana

ETV Bharat / crime

రేషన్ బియ్యం పట్టివేత.. ముగ్గురు అరెస్ట్​ - రేషన్​ బియ్య తరలిస్తుండగా పట్టుకున్న వెస్ట్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు

అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని వెస్ట్​జోన్ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​లోని కార్వాన్ వద్ద ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Illegal  Ration rice seized today in hyderabad at karwan
రేషన్ బియ్యం పట్టివేత.. ముగ్గురు అరెస్ట్​

By

Published : Feb 16, 2021, 5:33 PM IST

రేషన్​ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ముఠాను వెస్ట్​జోన్​​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​లోని కార్వాన్​ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 క్వింటాళ్ల చౌక బియ్యం, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

​కర్ణాటకకు తరలిస్తుండగా..

నగరంలో పలు చోట్ల స్థానికుల నుంచి కిలో రూ.5 రూపాయలకు కొనుగోలు చేసి, కర్ణాటకలోని బీదర్​లో అధిక ధరకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి.. రేషన్​ బియ్యాన్ని చార్మినార్​ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి :నేరెడ్​మెట్​లో ఏటీఎంల చోరీకి విఫలయత్నం​

ABOUT THE AUTHOR

...view details