తెలంగాణ

telangana

గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

By

Published : May 22, 2021, 10:17 PM IST

హైదరాబాద్​లో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

marinjuana in hyderabad
అక్రమంగా గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మే లఖన్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఇంటిపై దాడి చేసి నిందితుని నుంచి 6 కిలోల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరో ముగ్గురు నిందితులు పారిపోయినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో సీఐ రణ్వీర్ రెడ్డితోపాటు ఎస్ఐ జగన్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details