Illegal liquor seized: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దన్నానపేట వద్ద అర్ధరాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సమయంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ లేబుల్‌తో ఒడిస్సా నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. దీని విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని చెప్పారు.
భారీగా పట్టుబడిన మద్యం.. మొత్తం ఎన్ని సీసాలంటే? - Illegal liquor seized in srikakulam
Illegal liquor seized: ఏపీలో అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన ప్రభుత్వం, అలా చేయకుండా భారీగా రేట్లు పెంచింది. ఈ చర్యలతో అక్రమంగా మద్యం రాష్ట్రంలోకి వచ్చి చేరుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన వాహనాల తనిఖీలో పోలీసులు పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
భారీగా పట్టుబడిన మద్యం.. మొత్తం ఎన్ని సీసాలంటే?
మొత్తం 64 బాక్సుల్లో ఉన్న 3072 మద్యం సీసాలను జె.ఆర్.పురం పోలీసులు సీజ్ చేశారు. ఒడిస్సా నుంచి విజయనగరానికి టాటా మ్యాజిక్ వాహనంలో మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: