కామారెడ్డి జిల్లా భిక్నూర్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 203 బాటిళ్లను స్వాధీనం చేసుకుని.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జంగంపల్లి గ్రామానికి చెందిన నిందితులు సత్యనారాయణ, మహేశ్లు.. మద్యాన్ని హరియాణా నుంచి లారీల్లో అక్రమంగా తీసుకొచ్చి, గ్రామంలో అమ్మేవారు.
అక్రమ మద్యం పట్టివేత.. 203 బాటిళ్లు స్వాధీనం - అక్రమ మద్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 203 బాటిళ్ల మద్యం పోలీసులకు చిక్కింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలంలో జరిగింది.
అక్రమ మద్యం పట్టివేత.. 203 బాటిళ్లు స్వాధీనం
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు.. దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రాయల్ ఛాలెంజ్ 167, బ్లెండర్ స్ప్రైడ్ 4, సిగ్నేచర్ 14, రాక్ ఫోర్డ్ 18.. మొత్తం 203 మద్యం బాటిళ్ల స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణ రెడ్డి తెలిపారు.