IIIT Student Suicide: ఏపీలోని కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ఈసీఈ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న మారాడపు హారిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. హాస్టల్ భవనంలో మూడో అంతస్తుపై నుంచి దూకింది. వసతిగృహం కింద పడి ఉన్న హారికను ఉదయం పిల్లలకు పాలు తీసుకెళ్తున్న వ్యాను డ్రైవర్ చూసి సెక్యూరిటీకీ సమాచారం ఇవ్వగా వెంటనే హారికను నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
IIIT Student Suicide: ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
IIIT Student Suicide: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి దూకింది. వెంటనే ఆమెను నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
IIIT Student Suicide: ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
హారిక పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. విద్యార్ధినికి మల్టిపుల్ ఫ్యాక్ఛర్స్ అయ్యాయని.. ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని నూజివీడు ప్రభుత్వాసుపత్రి డాక్టర్ అనూష పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియదని... హాస్టల్ సిబ్బంది తెలిపారు.