చెరువులో తల్లీకుమార్తె మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా? - narayana pet crime news
![చెరువులో తల్లీకుమార్తె మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా? suicide or murder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13166334-thumbnail-3x2-suspect.jpg)
08:49 September 25
తల్లి, రెండేళ్ల చిన్నారి మృతదేహాలు గుర్తించిన గ్రామస్థులు
నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు మండలం తిమ్మారెడ్డిపల్లి తండాలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మారెడ్డిపల్లి తండా చెరువులో రెండు మృతదేహాల (dead bodies found in pond )ను గ్రామస్థులు చూశారు. మృతులు తల్లి, రెండేళ్ల చిన్నారిగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ తగాదాలతో ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.