తెలంగాణ

telangana

ETV Bharat / crime

Prank Video Failed : ప్రాంక్ వీడియో కాస్త.. ఫైట్ వీడియో అయింది - prank video goes wrong

ప్రాంక్ వీడియో(Prank Video).. యూట్యూబ్​ వీడియోల్లో ఎక్కువ వీక్షణలు వచ్చేది వీటికే. కారణం.. తక్కువ నిడివి.. సాగదీత లేకుండా ఎంటర్​టైన్​మెంట్ ఉండటం. కానీ.. ఈ ప్రాంక్ వీడియోలు తీసేటప్పుడు మాత్రం కంటెంట్ క్రియేటర్లు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ప్రాంక్ వీడియో తీస్తూ ఓ యాంకర్ దెబ్బలు తిన్న ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

ప్రాంక్ వీడియో కాస్త.. ఫైట్ వీడియో అయింది
ప్రాంక్ వీడియో కాస్త.. ఫైట్ వీడియో అయింది

By

Published : Jul 29, 2021, 10:02 AM IST

Updated : Jul 29, 2021, 12:41 PM IST

టాలెంట్ ఏదైనా.. ప్రపంచానికి తెలియాలంటే ఉన్న సులభమైన వేదిక.. సోషల్ మీడియా. ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తే సరి.. ప్రపంచమంతా చూసేస్తుంది. నచ్చితే లైకుల వర్షం కురిపిస్తుంది. యూట్యూబ్​లో గనుక ఈ వీడియోలు పెడితే.. డబ్బు కూడా సంపాదించొచ్చు. అందుకే జనాలు తమకు తోచిన వీడియోలు చేసి యూట్యూబ్​లో పెడుతుంటారు.

ఈ యూట్యూబ్ వీడియోల్లో.. క్రియేటివిటీ, వంటలు, ఎంటర్​టైన్​మెంటే కాకుండా.. ప్రాంక్​ వీడియోల(Prank Video)కు ఓ ప్రత్యేకత ఉంది. నిడివి తక్కువ ఉండి.. కేవలం 5 నిమిషాల్లోనే నవ్వు తెప్పించే కంటెంట్ ఉండే ప్రాంక్ వీడియోలంటే నెటిజన్లకు మక్కువ ఎక్కువ. ఈ ప్రాంక్ వీడియోలో.. తీసేవాళ్లకు తప్ప.. అందులో ఉన్న వారికి కంటెంట్ ఏంటో తెలియదు. దీనివల్ల కొన్నిసార్లు కంటెంట్ క్రియేటర్లు ఇబ్బందుల్లో పడతారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

ఇవీ చదవండి :

ప్రాంక్ వీడియో(Prank Video)పై హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లో ఓ మొబైల్ షాప్‌లో గొడవ జరిగింది. ‘హైదరాబాదీ ప్రాంక్స్’ యూట్యూబ్ ఛానెల్ యాంకర్ ఇమ్రుస్ షేక్.. ప్రాంక్ వీడియోలో భాగంగా షాప్ యజమానితో గొడవకు దిగాడు. గొడవ పెద్దది కావడంతో ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్‌ని చితకబాదాడు. అప్పటికే ఆవేశానికి లోనైనా షాప్‌ యజమాని ఇది ప్రాంక్ వీడియో అని చెప్పినా వినకుండా యాంకర్‌ను మరింత కసిగా కొట్టాడు. విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Last Updated : Jul 29, 2021, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details