తెలంగాణ

telangana

ETV Bharat / crime

woman suicide at srisailam: శ్రీశైలంలో వివాహిత ఆత్మహత్యాయత్నం... ఆమె చేతిలో ఏం ఉందంటే..! - today ap crime news

woman suicide at srisailam: శ్రీశైలంలో హైదరాబాద్​కు చెందిన వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ వద్ద పోలీసులకు ఫిర్యాదు కాపీ లభ్యమైంది.

woman suicide at srisailam
woman suicide at srisailam

By

Published : Nov 25, 2021, 2:52 PM IST

శ్రీశైలంలో స్థానిక దుకాణాల వద్ద మౌనికారెడ్డి అనే వివాహిత ఆత్మహత్యాయత్నానికి (Hyderabad woman suicide) పాల్పడింది. వెంటనే స్థానికులు ఆమెను 108 అంబులెన్స్​లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ వద్ద పోలీసు ఫిర్యాదు కాపీ లభ్యమైంది. వివాహిత హైదరాబాద్‌కు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.

బాధిత మహిళ వద్ద పోలీసు ఫిర్యాదు కాపీ
వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మౌనికా రెడ్డి వద్ద అక్టోబర్ నెలలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాపీ లభించింది. ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నం(srisailam crime news) చేసిందో ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి సున్నిపెంట ఆసుపత్రికి చేరుకున్నారు. శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details