తెలంగాణ

telangana

ETV Bharat / crime

Woman Suicide for Blouse : భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య - బ్లౌజ్ నచ్చలేదని మహిళ ఆత్మహత్య

Woman Suicide for Blouse : చిన్నచిన్న కారణాలతో క్షణికావేశంలో ఎంతో మంది తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. చదువుకునే పిల్లల నుంచి మొదలుకొని కాటికి కాలుచాచిన వృద్ధుల వరకు ఏదో ఒక కారణంతో తనువు చాలిస్తున్నారు. ఇలా ఓ చిన్న కారణంతో హైదరాబాద్​కు చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చకపోవడం జరిగిన చిన్ని వాగ్వాదంతో మనస్తాపం చెంది ఉరేసుకుంది.

Woman Suicide for Blouse
Woman Suicide for Blouse

By

Published : Dec 6, 2021, 1:03 PM IST

Updated : Dec 6, 2021, 2:45 PM IST

Woman Suicide for Blouse : హైదరాబాద్​ అంబర్​పేట్ గోల్నాకలోని తిరుమలనగర్​కు చెందిన విజయలక్ష్మి(40)-శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు. భర్త టేలరింగ్​ చేస్తూ ద్విచక్రవాహనంపై తిరిగి చీరలు అమ్ముతు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బతుకుతెరువు నిమిత్తం ఏపీలోని కడప నుంచి వచ్చిన ఈ కుటుంబం ఉన్నంతలో సంతోషంగా జీవిస్తోంది. ఇంతలో భార్యాభర్తల మధ్య జరిగిన చిన్ని తగాదా.. ఆ పిల్లల్ని తల్లిలేని వాళ్లను చేసింది. క్షణికావేశంలో విజయలక్ష్మి తీసుకున్న నిర్ణయం ఆమె భర్తను ఒంటరివాణ్ని చేసింది.

అసలేం గొడవ జరిగిందంటే..

Woman Suicide for Blouse in Hyderabad : ఈనెల 4న శ్రీనివాస్ తన భార్య విజయలక్ష్మి కోసం ఓ బ్లౌజ్ కుట్టాడు. కుట్టిన తర్వాత ఆ జాకెట్​ను భార్యకు చూపించాడు. అది నచ్చని భార్య అతడిపై అరిచింది. చిరాకు పడిన శ్రీనివాస్ 'నచ్చకపోతే నువ్వే కుట్టుకో' అని చెప్పి విసురుగా అక్కణ్నుంచి బయటకు వెళ్లాడు. భర్త మాటలకు మనస్తాపానికి గురైన విజయలక్ష్మి బెడ్​రూంలోకి వెళ్లి తలుపులు మూసింది.

బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య

Wife Suicide for Blouse : పిల్లలు మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చి చూస్తే తమ తల్లి బెడ్​రూంలో తలుపు మూసుకుని ఉండటం చూశారు. తలుపు తట్టినా ఆమె గడియ తీయలేదు. ఈలోగా బయటకు వెళ్లిన శ్రీనివాస్.. ఇంటికి వచ్చాడు. పిల్లలు తమ తండ్రితో అమ్మ తలుపు తీయలేదని చెప్పగా.. అతను తలుపు గట్టిగా బాదాడు. ఎంతకీ తీయకపోవడంతో పగులగొట్టి లోపలికి వెళ్లాడు.

ఇలా చేస్తుందని ఊహించలేదు..

Wife Suicide for Blouse in Hyderabad : తీరా చూస్తే విజయలక్ష్మి ఫ్యాన్​కు ఉరి వేసుకుని వేలాడుతుండటం చూసి షాకయ్యాడు. వెంటనే ఆమెను కిందకు దించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. చిన్న గొడవకే ఇంత దారుణానికి ఒడిగడుతుందని అనుకోలేదని శ్రీనివాస్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఉదయం ఎంతో ఆనందంగా ఉన్న తల్లి మధ్యాహ్నానికి విగత జీవిగా పడి ఉండటం చూసిన పిల్లలు అమ్మా.. మాట్లాడమ్మా అంటూ ఆమె మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Dec 6, 2021, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details