ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో అతనిపై ఏకంగా 160 చోరీ కేసులు ఉన్నాయి. దొంగతనాలు చేయడమే వృత్తిగా చేసుకొని 30 ఏళ్ల నుంచి దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని రెక్కీ నిర్వహించి చోరీ చేస్తాడు. పీడీ చట్టం కింద పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ వైఖరి మారలేదు. తిరిగి వచ్చాక దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. మరోసారి అతడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
మహ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి వృత్తి పెయింటింగ్. ముప్పై ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకొని చోరీలు చేసేవాడు. ఇప్పటివరకు ఇతనిపై 160 కేసులు ఉన్నాయి. నిందితుడి వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నాం. -అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ