Police Raids on Party: మద్యం, హుక్కా సేవించి డ్యాన్స్.. 44 మంది అరెస్టు - యూత్ పార్టీపై పోలీసులు దాడులు
12:17 November 28
మద్యం, హుక్కా సేవించి డ్యాన్స్.. 44 మంది యువకులు అరెస్టు
Police Raids on Party: హైదరాబాద్ కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లో ఓ ఇంటిపై పోలీసులు దాడిచేశారు. పార్టీ చేసుకుంటున్న 44 మంది యువకులను అరెస్ట్ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో దాడులు చేసి.. మద్యం, హుక్కా సేవించి నృత్యాలు చేస్తుండగా అరెస్ట్ చేశారు. వారాంతాల్లో యువకులు పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకులు ఇమ్రాన్, దయాల్‌పై కేసు నమోదు చేశారు.
వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్న యువకులంతా.. రెండేళ్ల నుంచి ప్రతి శనివారం పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.300 తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఓ ఇంటిని రూ.30 వేలకు అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. వీరందరిని అరెస్ట్ చేసి కూకట్‌పల్లి పీఎస్‌కు తరలించారు.
ఇదీచూడండి:Doctor, patient heartattack: గుండెపోటుతో రోగి, వైద్యుడు మృతి