Drugs Seized at Jagathgiri Gutta : న్యూ ఇయర్ వేడుకల్లో మాదకద్రవ్యాల సరఫరాను కట్టడి చేయడానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా మత్తుపదార్థాలు పట్టుబడుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంత నియంత్రించినా.. పలుప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతూనే ఉంది.
Drugs Seized at Jagathgiri Gutta : న్యూ ఇయర్ పార్టీ కోసం డ్రగ్స్.. స్వాధీనం చేసుకున్న పోలీసులు - ganjayi supply for new year events
11:48 December 30
న్యూ ఇయర్ పార్టీ కోసం డ్రగ్స్.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
న్యూ ఇయర్ కోసం..
Drugs Supply for New Year : తాజాగా మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో పోలీసులు మాదకద్రవ్యాలు పట్టుకున్నారు. ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఎల్ఎస్డీ, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
డార్క్‌వెబ్ ద్వారా..
Drugs Supply for New Year in Hyderabad : న్యూ ఇయర్ వేడుకల కోసం.. దిల్లీ, గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు బాలానగర్ ఎస్ఓటీ, జగద్గిరిగుట్ట పోలీసులు చెప్పారు. డార్క్ వైబ్‌సైట్ ద్వారా డ్రగ్స్ కోసం విక్రయదారులను సంప్రదించిన ఇద్దరు యువకులు వారికి క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు పంపినట్లు తెలిపారు. నిందితుల నుంచి 44 ఎల్ఎస్డీ డ్రగ్స్ పేపర్లు, చాక్లెట్, బిస్కెట్ల రూపంలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అన్నారు. ఈ యువకులు ఇతరులకు అమ్మేందుకు ఆ డ్రగ్స్‌ను సిద్ధం ఉంచారని చెప్పారు. నిందితులు అఖిల్(22), పరమేశ్(20)లుగా పోలీసులు గుర్తించారు.