డేటింగ్ సైట్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు చరవాణులు, పలు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
డేటింగ్ సైట్ల పేరిట మోసం.. ఇద్దరు సైబర్ నేరస్థుల అరెస్ట్ - cyber criminals arrest in hydearabad
దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కొత్త పద్దతుల ద్వారా ప్రజలకు గాలం వేస్తున్న కేటుగాళ్లు వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి డేటింగ్ సైట్ల పేరిట రూ. 41 లక్షలు కాజేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన కౌషల్ చౌదరి, ఉమేష్ యాదవ్‌లు కొద్దికాలంగా డేటింగ్ సైట్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి డేటింగ్ సైట్ల ద్వారా గాలం వేశారు. అతని వద్ద నుంచి డిపాజిట్ పేరిట సుమారు రూ. 41.5లక్షలను బ్యాంకు ఖాతా ద్వారా మళ్లించుకున్నారు. వారు ఎంతకీ స్పందించకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. నిందితులు గతంలో పలువురిని ఈ విధంగానే మోసం చేశారని పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి:సీఎం పీఏనంటూ నమ్మబలికి.. రూ.15 లక్షలు దండుకున్నాడు!