Ganza Smugglers Arrest: గంజాయి సరఫరాకు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం తరలించడానికి స్మగ్లర్లు ఎలాంటి కొత్త పద్ధతులు వెతుకుతున్నారో.. ఇప్పుడు గంజాయి తరలించడానికి అలాంటి వాటినే అమలుచేస్తున్నారు. తాజాగా ఒడిశా-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి పరుపుల్లో గంజాయి నింపి హైదరాబాద్‌కు తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
'పుష్ప' సినిమా తలపించేలా గంజాయి సరఫరా... చివరకు... - మాదాపూర్ తాజా సమాచారం
Ganza Smugglers Arrest: గంజాయి స్మగ్లర్లు సరుకు తరలించడానికి కొత్తకొత్త మార్గాలు వెతుకున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్... పోలీసుల కళ్లు కప్పి ఎర్రచందనం తరలించడానికి ఎన్ని ఎత్తులు వేశాడో చూశాం. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరాకు చేసేందుకు స్మగ్లర్లూ అదే బాట అనుసరించారు. పరుపుల్లో గంజాయి నింపి తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 81 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పరుపుల మధ్యలో నింపి..:పరుపుల మధ్యలోని ప్రాంతంలో స్పాంజ్ తీసేసి గంజాయి నింపిన ప్యాకెట్లను పెట్టి... పరుపుల మాదిరిగా తయారు చేసి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో చందానగర్ నల్లగండ్ల చౌరస్తాలో మాదాపూర్, చందానగర్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు చేపట్టగా... నిందితులు పట్టుబడ్డారు. మొత్తం 81 కిలోల గంజాయి, కారు, గంజాయి తరలిస్తున్న గూడ్స్ ఆటోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:'రాజరాజచోర' సినిమా స్టైల్లో చోరీలు.. గజదొంగలకు బెయిల్ ఇప్పించి మరీ..!