రౌడిషీటర్ పర్వేజ్ అలియాస్ ఫర్రూ హత్య కేసును ఛేదించామని హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్ తెలిపారు. షేక్ సులేమాన్, ఫిరోజ్ అనే ఇద్దరు వ్యక్తులు హత్య చేయగా వారికి మరో నలుగురు సహకరించారు. ఫర్రూ, సులేమాన్‌కు మధ్య జరిగిన బెట్టింగ్ వివాదమే హత్యకు కారణమని డీసీపీ తెలిపారు. ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
రౌడిషీటర్ల హత్యలను ఛేదించిన పోలీసులు
రేయిన్ బజార్ పరిధిలో జరిగిన రౌడిషీటర్ మహ్మద్ పర్వేజ్ అలియాస్ ఫర్రూ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పర్వేజ్‌ను షేక్ సులేమాన్, ఫిరోజ్ అనే ఇద్దరు వ్యక్తులు హత్య చేయగా... వారికి మరో నలుగురు సహకరించినట్లు హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్ తెలిపారు. ఫలక్ నామా పరిధిలో జరిగిన మరో రౌడీషీటర్ జాబెర్ హత్య కేసును సైతం ఛేదించామని అన్నారు.
రౌడిషీటర్ల హత్యలను ఛేదించిన పోలీసులు
ఫలక్‌నుమా పరిధిలో జరిగిన మరో రౌడీషీటర్ జాబెర్ హత్య కేసును సైతం ఛేదించామని డీసీపీ పేర్కొన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఇస్మాయిల్, సైఫ్ అలీ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు హత్య చేశారని అన్నారు. ఈ కేసులో మెుత్తం ఆరుగురిని అరెస్ట్ చేయగా... అందులో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. ఇవి రెండు రివేంజ్ హత్యలేనని అన్నారు.
ఇదీ చదవండి:మోసాలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్: సీపీ