శాక్రిఫైజ్ స్టార్ సునిషిత్ ( Sacrifice star Sunishit )... యూట్యూబ్‌లో వీడియోలు చూసే వారికి ఈ పేరు తెలిసే ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో ఉండే వారికి మాత్రం... ప్రత్యేకంగా ఇతని గురించి చెప్పాల్సిన పనిలేదు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ... ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. ఆ సినిమా ఛాన్స్ నాకే వచ్చేసింది.. ఆ హీరో అడిగితే ఇచ్చేసా... అంటూ... వివాదస్పద వ్యాఖ్యలు చేసి... హడావుడి చేస్తుంటాడు. అంతేనా.. హీరోయిన్లతో.. పెళ్లైంది.. అంటూ..సోది కబుర్లు కూడా చెప్తు ఉంటాడు. ఈసారి శాక్రిఫైజ్ స్టార్ సినీ ప్రముఖుల మీద కాకుండా ఓ పోలీస్ ఆఫీసర్ మీద ఆరోపణలు చేసి అరెస్టయ్యాడు.
ఇదీ జరిగింది...
ఇటీవల సునిషిత్ టీవీ పేరుతో ఓ య్యూట్యూబ్ ఛానల్ (Sunishit YouTube channel) ప్రారంభించాడు. వివాదస్పద వీడియోలను పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇటీవల మల్కాజిగిరి స్టేషన్‌లో పని చేసే ఓ పోలీసు అధికారిపై తప్పుడు వీడియో పోస్ట్ చేశాడు. ఆ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తప్పుడు వీడియో ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడని కీసర సీఐ నరేందర్‌గౌడ్ తెలిపారు.