హైదరాబాద్‌లో మత్తు పదార్థాలు విక్రయించేందుకు యత్నించిన ఇద్దరు సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయికి చెందిన అహ్మద్ వృత్తి రీత్యా దర్జీ. ఏపీలోని నెల్లూరుకు చెందిన కిషోర్.. బతుకుదెరువు కోసం ముంబయి వెళ్లి అహ్మద్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. నైజీరియా దేశస్థుడితో మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్న వీరిద్దరు... మార్కెట్లో అధిక ధరకు విక్రయించడం మొదలుపెట్టారు.
డ్రగ్స్ విక్రయానికి యత్నించిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
ముంబయి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించడానికి యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ముంబయికి చెందిన వ్యక్తి కాగా మరొకరు ఏపీలోని నెల్లూరు వాసిగా పోలీసులు గుర్తించారు.
మాదక ద్రవ్యాలు
హైదరాబాద్‌కు చెందిన మాదక ద్రవ్యాల విక్రేత సల్మాన్‌తో పరిచయం పెంచుకొని వాటిని ఇక్కడికి సరఫరా చేసేందుకు ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముంబయి నుంచి నాంపల్లికి వచ్చి ఓ హోటల్లో బస చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హోటల్ పై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. మూడున్నర లక్షల రూపాయల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సల్మాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:దొంగల అరెస్ట్.. ఆభరణాలు, నగదు స్వాధీనం