ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న(cyber crime news)సైబర్ నేరగాళ్ల బృందాన్ని చంచల్‌గూడ జైలులో రిమాండ్‌కు తరలించారు.. పోలీసులు. ఓఎల్ఎక్స్లో వస్తువులు కొంటామని అమాయకులను నమ్మించి.. బాధితుల ఖాతాలో నుంచి నగదు కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్బుక్ హ్యాక్ చేసి.. అందులోని ఫ్రెండ్స్‌కు రిక్వెస్ట్‌లు పంపి నగదు వసూళ్లకు పాల్పడినట్లు తేల్చారు. ఈ ఘటనలపై సైబర్‌క్రైం పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ ముఠాపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ పలు కేసులు నమోదయ్యాయి.
OLX Cheating News:ఓఎల్ఎక్స్లో వస్తువులు కొంటామంటూ.. అమాయకులకు టోకరా - olx crime news
ఓఎల్ఎక్స్లో వస్తువులు కొంటామంటూ (cyber crime ) అమాయకులను నమ్మించి మోసగించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు రాజస్థాన్‌కు చెందిన అల్వార్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచి.. చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు పంపారు.
![OLX Cheating News:ఓఎల్ఎక్స్లో వస్తువులు కొంటామంటూ.. అమాయకులకు టోకరా cyber crime news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13299400-26-13299400-1633700622708.jpg)
cyber crime news
ఈ కేసులపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితులు రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. రెండు నెలల క్రితం 12 మంది నిందితులను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. అనంతరం జైలుకు పంపారు. అనంతరం కూకట్పల్లి కోర్టులో పీటీ వారెంట్ కోరారు. 12 మందిని కోర్టులో హాజరుపరిచి.. చంచల్‌గూడ జైలుకు పంపారు.
ఇవీచూడండి: