Fraud by taking money from friends: తన తండ్రి అనంతపురంలో వైకాపా ఎమ్మెల్సీ అని, తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహకుడి వద్ద రూ.28 లక్షల మేర స్వాహా చేశాడో ఓ యువకుడు. ఎస్సార్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యవంశీ ప్రకాష్(28) అనే వ్యక్తి అమీర్‌పేటలో జీపీఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థ నిర్వహిస్తున్నాడు. గతేడాది జులైలో కార్తిక్‌రెడ్డి(30) అనే వ్యక్తి సూర్యవంశీని కలిశాడు.
తన తండ్రి రామ్మోహన్‌రెడ్డి ఏపీలో ఎమ్మెల్సీ అని, తాను కాబోయే వైఎస్సార్ తెలంగాణ పార్టీ నగర అధ్యక్షుడినని చెప్పుకున్నాడు. జీపీఎస్ ఇన్ఫోటెక్ కార్యాలయంలో తనకు కొంత భాగం అద్దెకివ్వాలని కోరాడు. అంగీకరించిన సూర్యవంశీ ప్రకాష్ రూ.40వేలు ధరావతు, నెలకు రూ.15వేల చొప్పున తన కార్యాలయంలోని కొంత భాగం అద్దెకిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇదే అదనుగా తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి ఒకసారి సూర్యవంశీ వద్ద రూ.86వేలు అప్పుగా తీసుకున్నాడు. మరోసారి కార్తిక్‌రెడ్డి తండ్రిగా చెప్పిన రామ్మోహన్‌రెడ్డి పేరిట మరో వ్యక్తి సూర్యవంశీతో ఫోన్‌లో మాట్లాడాడు.