తెలంగాణ

telangana

ETV Bharat / crime

మహేశ్ బ్యాంకు సర్వర్​ హ్యాకింగ్​ కేసు.. కలకత్తా వెళ్లిన పోలీసులు - మహేశ్​ బ్యాంకు సర్వర్​ హ్యాకింగ్​

Mahesh Bank Server Hacking Case: మహేశ్​ బ్యాంకు సర్వర్​ హ్యాకింగ్​ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు కలకత్తా వెళ్లారు. ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు బ్యాంకులకు డబ్బులు బదిలీ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసులో మహేశ్​ బ్యాంకు ఖాతాదారు ఫాతిమా కోసం గాలిస్తున్నారు.

Mahesh Bank Server Hacking Case
మహేశ్​ బ్యాంకు సర్వర్​ హ్యాకింగ్​ కేసు

By

Published : Jan 31, 2022, 10:42 PM IST

Mahesh Bank Server Hacking Case: మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కలకత్తా వెళ్లారు. రేపు సాయంత్రానికి పోలీసులు అక్కడి చేరుకుంటారు. మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు 3 ఖాతాల్లోకి 12.4 కోట్లను మళ్లించారు. ఆ మూడు ఖాతాల నుంచి ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లోని 20 బ్యాంకులకు బదిలీ చేశారు. 20 బ్యాంకుల్లో దాదాపు 128 ఖాతాలకు 12.4కోట్లు బదిలీ అయ్యాయి. 128 ఖాతాల నుంచి మరో 200 ఖాతాలకు డబ్బులను బదిలీ చేసినట్లు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ఖాతాదారుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సదరు ఖాతాదారులకు, సైబర్ నేరగాళ్లకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

మహేశ్ బ్యాంకు ఖాతాదారు షానవాజ్ ఫాతిమా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈమె ఖాతాలోకి దాదాపు రూ.7 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ నెల 11న ఆమె పేరు మీద ఖాతా తెరిచారు. ఆ తర్వాత 9 రోజులకే రూ.7 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన మహేశ్ బ్యాంకు సిబ్బంది... ఫాతిమాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే ఆమె ఫోన్ స్విచాఫ్ చేసింది. మహేశ్ బ్యాంకు సిబ్బంది పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. పోలీసులు చరవాణి సిగ్నల్ ఆధారంగా ఫాతిమా ముంబయి పారిపోయినట్లు తెలుసుకున్నారు. ఆమె గోల్కొండలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఫాతిమా తల్లి, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

సైబర్ నేరగాళ్లకు షానవాజ్ సహకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ఐపీ అడ్రస్ యూరప్ దేశాల్లో చూపిస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ఫ్రాక్సీ ఐపీ అడ్రస్​లు ఉపయోగించినట్లు పోలీసులు తేల్చారు. ముంబయి, దిల్లీ లేదా హైదరాబాద్ నుంచే సర్వర్ హ్యాక్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details