రోజురోజుకు మావన సంబంధాలు కనుమరుగవుతున్నాయి. బంధాలకు, విలువలకు తిలోదకాలిచ్చి.. వావివరుసలతో సంబంధం లేకుండా పెచ్చుమీరిపోతున్నారు కొందరు. వరుసకు అక్క అయ్యే యువతిని వేధిస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
అక్కకు అసభ్య సందేశాలు.. చివరికి కటకటాలు - అక్కకు అసభ్య మెసేజ్‌లు పంపిన వ్యక్తి అరెస్ట్
వావివరుసలు మరిచిన ఓ పోకిరి కటకటాల పాలయ్యాడు. అసభ్య మెసేజ్‌లతో వరుసకు అక్క అయ్యే యువతిని విధిస్తున్న పోకిరిని సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
వరుసకు అక్క అయ్యే యువతిని వేధించిన పోకిరి
కొన్ని రోజులుగా ఓ యువతికి అపరిచిత నెంబర్ నుంచి అసభ్యంగా మెసేజ్‌లు వస్తున్నాయి. వీటిపై ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు ఆమెకు వరుసకు తమ్ముడయ్యే వ్యక్తే మెసేజ్‌లు చేస్తున్నట్లు గుర్తించారు. అసభ్య మెసేజ్‌లు పంపిన అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:జైల్లో ఖైదీలకు ‘సైకో కిల్లర్ రాములు’ పాఠాలు