తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెండు వేర్వేరు చోరీ కేసుల్లో నలుగురు అరెస్ట్​ - రెండు వేర్వేరు చోరీ కేసుల్లో నలుగురు అరెస్ట్​ చేసిన హైదరాబాద్​ పోలీసులు

హైదరాబాద్​లో రెండు వేర్వేరు దొంగతనాల కేసుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు సీపీ అంజనీకుమార్​ తెలిపారు. కేసుల వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

hyderabad cp anjani kumar
హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​

By

Published : Mar 4, 2021, 5:41 PM IST

Updated : Mar 4, 2021, 11:17 PM IST

రెండు వేర్వేరు కేసుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. సైదాబాద్‌ పరిధిలో గొలుసు దొంగతనాలు చేస్తున్న సయ్యద్‌ అస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఆరున్నర తులాల బంగారం, కత్తి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఓల్ట్​ మలక్​పేటకు చెందిన అస్లాం ఈ నెల 2న కేశవనగర్​, ఎల్బీనగర్​లో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. సంతోష్​ నగర్​ పీఎస్​ పరిధిలో బైక్​ను దొంగిలించాడు.

నిందితుడిపై గతంలో హత్యాయత్నం, చోరీ కేసులతో పలు స్టేషన్లలో 40కి పైగా కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. పాత నేరగాళ్లతో జత కట్టి భూ వివాదాల్లోనూ తలదూర్చినట్లు పేర్కొన్నారు. అతనిపై పీడీ యాక్ట్​ కింద చర్యలు తీసుకుంటామని వివరించారు.

అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చరవాణీలు దొంగతనం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలు చేస్తున్నట్లు అంజనీకుమార్‌ వెల్లడించారు.

రెండు వేర్వేరు చోరీ కేసుల్లో నలుగురు అరెస్ట్​

ఇదీ చదవండి:నకిలీ బంగారంతో దోపిడీ.. ఉద్యోగాల పేరిట బురిడీ

Last Updated : Mar 4, 2021, 11:17 PM IST

ABOUT THE AUTHOR

...view details