Actor Arrested in Forgery Case: ఫోర్జరీ సంతకాలతో మోసం చేసి సంస్థ ఆస్తులను సొంతం చేసుకున్నాడని బాధితుల ఫిర్యాదుతో సినీ నటుడు అట్లూరి నవీన్‌రెడ్డిపై హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలో స్తిరాస్థి వ్యాపార నిర్వహణకు అట్లూరి నవీన్‌రెడ్డి, ఎమ్.శ్రీధర్‌రెడ్డి, పి.నవీన్ కుమార్ డైరెక్టర్లుగా గతేడాది ఎన్ స్వ్కేర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించారు.
ఫోర్జరీ కేసులో సినీ నటుడు అరెస్ట్ - తెలంగాణ నేర వార్తలు
Actor Arrested in Forgery Case: ఫోర్జరీ సంతకాలతో మోసం చేసిన ఓ నటుడిపై నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థ కొనుగోలు చేసిన పలు స్థలాలను అట్లూరి నవీన్‌రెడ్డి ఒక్కడే ఫోర్జరీ సంతకాలతో విక్రయించినట్టు మిగిలిన భాగస్వాములు గుర్తించారు. దీంతో వారు నగర సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నవీన్‌రెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
సూర్యాపేట జిల్లాకు చెందిన అట్లూరి నవీన్‌రెడ్డి పలు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన స్థలాలను ఫోర్జరీ సంతకాలతో విక్రయించి, సొమ్ము చేసుకున్నట్టు మిగిలిన భాగస్వాములు గుర్తించారు. రూ.55 కోట్ల మేర తాము నష్టపోయినట్లు అంచనాకు వచ్చారు. ఈ సొమ్ముతో తాను హీరోగా సినిమా ప్రారంభించినట్టు తెలుసుకున్నారు. తాము మోసపోయినట్టు గ్రహించిన బాధితులు శ్రీధర్‌రెడ్డి, నవీన్ గత నెల 2న నగర సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా నవీన్‌రెడ్డిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చదవండి: