తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suspicious Death: భార్య మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి.. చెరువులో పడేసేందుకు భర్త యత్నం.! - husband wrapped dead body of a wife in a blanket at bathula lake

కట్టుకున్న భార్య మృతదేహాన్ని(Dead Body In a Blanket) దుప్పట్లో మలిచాడు ఓ భర్త. స్నేహితుడి సాయంతో మూడోకంటికి తెలియకుండా చెరువులో పడేద్దామనుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇదేందయ్యా అని అడిగితే దహన సంస్కారాలకు డబ్బులు లేవు.. అందుకే ఇలా చేస్తున్నానన్నాడు. అతని తీరుపై అనుమానం రావడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

DEAD BODY IN A BLANKET
దుప్పట్లో భార్య మృతదేహం

By

Published : Sep 24, 2021, 10:04 AM IST

Updated : Sep 24, 2021, 3:27 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో వివాహిత అనుమానస్పద మృతిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. హయత్‌నగర్‌లోని బాతుల చెరువు అలుగు వద్ద డేగ శ్రీను అనే వ్యక్తి.. తన భార్య లక్ష్మి మృతదేహాన్ని మిత్రుడితో కలిసి దుప్పట్లో మలిచి తీసుకొచ్చాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

రంగారెడ్డి జిల్లా హయత్​ నగర్​లో దారుణం

భర్త శ్రీనుతో పాటు అతని స్నేహితుడిని విచారించారు. లక్ష్మి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంత్యక్రియలకు డబ్బులు లేక మృతదేహాన్ని చెరువులో పూడ్చిపెట్టేందుకు తీసుకువెళ్లినట్లు మృతురాలి భర్త పేర్కొన్నట్లు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదికతో వాస్తవాలు బయటపడతాయని వివరించారు.

అసలేం జరిగిందంటే

ఏపీలోని నెల్లూరుకు చెందిన దంపతులు శ్రీను, లక్ష్మీ.. హయత్​నగర్​లో గత ఆరు నెలలుగా నివాసముంటున్నారు. వారికి పాప(9), బాబు(5) ఉన్నారు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి శ్రీను అతని స్నేహితుడు కోడూరి వినోద్‌తో కలిసి లక్ష్మీ మృతదేహాన్ని(DEAD BODY IN A BLANKET) దుప్పట్లో చుట్టి బాతుల చెరువు అలుగువద్ద పడేసేందుకు యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఇదీ చదవండి:excise department on drugs case: ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యం!.. డ్రగ్స్​ కేసులో అభియోగపత్రాల విచారణలో జాప్యం

Last Updated : Sep 24, 2021, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details