ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకా గ్రామంలో శుక్రవారం ఉదయం సంధ్య అనే మహిళతో ఆమె భర్త నర్సింహారావు గొడవపడ్డాడు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన నర్సింహారావు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సంధ్యకు సుమారు 10 చోట్ల గాయాలయ్యాయి.
భార్యపై కత్తితో భర్త దాడి.. అనుమానమే కారణం! - husband tried to kill his wife in mulugu district
క్షణికావేశంలో భార్యపై భర్త విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకా గ్రామంలో చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు మహిళను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
భార్యపై కత్తితో భర్త దాడి
గమనించిన స్థానికులు మహిళను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రధానంగా అనుమానంతోనే తనపై దాడి చేశాడని బాధితురాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.