Husband burnt wife alive in Hyderabad : హైదరాబాద్ నగరంలోని దారుణం జరిగింది. హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య ఆమె ప్రియుడిపై భర్త హత్యా యత్నం చేశాడు. నారాయణగూడ వంతెన కింద పూలు అమ్ముకుని నాగుల సాయి, ఆర్తి దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భార్యాభర్తలకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
కొద్దిరోజులుగా ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే నాగరాజు అనే యువకుడితో పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె వినలేదు. ఆమెపై కోపం పెంచుకున్న భర్త ఎలా అయినా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి నారాయణగూడలోని నివాసం ఉంటున్న ఆర్తి ఇంటికి వెళ్లాడు.