ఏపీలోని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వీసీ వడ్డిపల్లెకు చెందిన కృష్ణంరాజు అలియాస్ చిన్నరాజుకు భార్య , ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మూడు రోజుల క్రితం చిన్నరాజు భార్యకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. చికిత్స నిమిత్తం ఆమెను తిరుపతిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
కరోనా సోకిందని.. భార్యను హత్య చేసిన భర్త - chithore district latest news
భార్యకు కరోనా సోకడాన్ని తట్టుకోలేని భర్త మనస్తాపానికి గురై పురుగులమందు తాగాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా వీసీ వడ్డిపల్లెలో జరిగింది.
ఏపీలో హత్య, ఏపీలో భార్యను హత్య చేసిన భర్త
తన భార్యకు ఏమైనా అయితే పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనన్న అనుమానంతో చిన్నరాజు తీవ్ర మనస్తాపానికి గురై పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని దామల్చెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.