తెలంగాణ

telangana

ETV Bharat / crime

భార్య చికెన్​ వండలేదని భర్త ఆత్మహత్య..! - చికెన్​ కోసం ఆటోడ్రైవర్​ ఆత్మహత్య

Husband Suicide For Chicken: అతడో ఆటోడ్రైవర్‌.. పీకలాదాకా మద్యం తాగాడు. చికెన్​ తీసుకుని ఇంటికెళ్లాడు. ఘుమఘుమలాడే చికెన్​ కూర వండాలని భార్యకు చెప్పాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ భర్త అడిగినట్టు అతడి భార్య చికెన్​ వండిస్తే అంతా సవ్యంగానే ఉండేది కావచ్చు. కానీ.. ఆమె చేయలేదు. ఆ తర్వాత ఏమైందంటే..?

Husband suicide for wife rejected cooking chicken in home
Husband suicide for wife rejected cooking chicken in home

By

Published : Mar 29, 2022, 8:22 PM IST


Husband Suicide For Chicken: మహబూబ్‌నగర్‌ జిల్లా కేతిరెడ్డిపల్లి చింతకుంట తండాకు చెందిన రతన్‌లాల్‌(32) రాధిక భార్యాభర్తలు. వారికి ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు కుమారులు, ఒక కూతురు. మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్​కు వచ్చారు. దుండిగల్‌లో అద్దెకు ఉంటున్నారు. రతన్​లాల్​ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా.. ఈ నెల 25(శుక్రవారం) సాయంత్రం రతన్​లాల్​ ఫూటుగా మద్యం సేవించాడు. చికెన్​ తీసుకుని ఇంటికి వచ్చాడు. వెంటనే కోడికూర వండాలని భార్యను ఆదేశించాడు. భార్య నిరాకరించింది.

ఇటీవలే తాను, కూతురు ఇద్దరూ.. చికెన్‌ఫాక్స్‌(అమ్మవారు) బారినపడటం వల్ల మాంసాహారం తీసుకోకూడదంటూ భర్తకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. మత్తులో ఉన్న రతన్​లాల్​కు అదేది అర్థంకాలేదు. భార్యతో గొడవ పెట్టుకుని.. కోపంతో ఊగిపోతూ బయటకు వెళ్లిపోయాడు. మరుసటిరోజు (26న) తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మహబూబ్‌నగర్‌లో ఉన్న తల్లికి ఫోన్‌ చేశాడు. వెంటనే యాసిడ్‌ తాగేశాడు. బాధ బరించలేక ఇంటికొచ్చి​ యాసిడ్‌ తాగినట్టు కుటుంబసభ్యులకు తెలిపాడు.

అప్పటికే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రతన్​లాల్​ను.. మొదట సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆదివారం(27న) సాయంత్రం నారాయణ ఆసుపత్రికి మార్చారు. పరిస్థితి మెరుగవకపోవటంతో.. చికిత్స పొందుతూనే సోమవారం(28) అర్ధరాత్రి రతన్​లాల్​ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details