Life Imprisonment:డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్యను హత్య చేసిన భర్తకు ఎల్బీనగర్ కోర్టు జీవిత ఖైదు(life imprisonment) విధించింది. జైలు శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది నవంబర్లో మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఈ ఘటన జరిగింది.
Life Imprisonment: భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు - నేర వార్తలు
భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు (life imprisonment in wife murder case) విధించింది ఎల్బీనగర్ కోర్టు. ఇల్లు అమ్మిన డబ్బును ఇవ్వలేదన్న కోపంతో గతేడాది నవంబర్లో భార్యను అంతమొందించాడు.
జీవిత ఖైదు పడిన నాగరాజు
కొంపల్లికి చెందిన నాగరాజు తన భార్య అనిత ఇల్లు అమ్మిన డబ్బులు బ్యాంక్ ఖాతాలో పెట్టుకుని ఇవ్వడం లేదని కోపం పెంచుకున్నాడు. అదే కారణంతో గతేడాది నవంబర్లో ఆమెను అంతమొందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితునికి జీవితఖైదుతో(life imprisonment in wife murder case) పాటు జరిమానా విధిస్తూ ఎల్బీనగర్ కోర్టు శిక్ష ఖరారు చేసింది.
ఇవీ చూడండి: