తెలంగాణ

telangana

ETV Bharat / crime

Newly Wedded Bride Murder : భార్య హత్యకు ఆన్​లైన్​లో షాపింగ్.. - Newly Wedded Bride Murder in Bachupally

హైదరాబాద్​ బాచుపల్లి పీఎస్​ పరిధిలోని ప్రగతినగర్​లో నవవధువు హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల రోజుల క్రితమే ప్రేమపెళ్లి చేసుకున్న భార్యను హతమార్చడానికి ముందుస్తుగా ప్రణాళిక రచించినట్లు తెలిసింది. దీనికోసం అతను మడత చాకు(ఫోల్డెడ్ నైఫ్​)ను ఆన్​లైన్​లో ఆర్డర్​ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఆన్​లైన్​లో మడత చాకు కొని భార్య హత్య
ఆన్​లైన్​లో మడత చాకు కొని భార్య హత్య

By

Published : Sep 28, 2021, 10:35 AM IST

నవ వధువును భర్త హత్య చేసిన కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి ప్రగతినగర్‌లో 28 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సుధారాణిని ఆమె భర్త కిరణ్‌కుమార్‌ గొంతు కోసి అంతమొందించిన సంగతి తెలిసిందే. భార్యను హత్య చేయడానికి అతను ముందస్తు ప్రణాళికను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం ప్రత్యేక ‘మడత చాకు’ను అంతర్జాలంలో ఆర్డర్‌ ద్వారా కొనుగోలు చేసినట్లు సమాచారం. 5 రోజుల ముందే దాన్ని ఆర్డర్‌ చేయగా హత్య జరగడానికి ముందురోజు అది డెలివరీ అయినట్లుగా పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. చరవాణి అంత పొడవుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. దానితోనే సుధారాణి గొంతు కోసి తానూ గాయపరుచుకుని ఉంటాడని భావిస్తున్నారు. భార్యను హత్య చేశాక మృతురాలి బంధువులు తనను ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయని భావించిన అతను కావాలనే అదే చాకుతో గాయపరుచుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిజాంపేట రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న అతనికి ప్రాణాపాయం తప్పినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గొంతుకు అంగుళం లోతులో చర్మం తెగిందని వైద్యులు చెబుతున్నారు. ఆ కారణంగా సరిగా మాట్లాడలేకపోతున్నాడని సమాచారం.

గర్భం దాల్చిందని..

ఇదే రోజున నగరంలోని భరత్​నగర్​లో అనుమానంతో భార్యను గొంతు నులిమి భర్త హత్య చేశాడు. పెళ్లైన రెండు నెలలకే మనస్పర్థలతో పుట్టింటికి వెళ్లిన మానస.. భర్త గంగాధర్ తండ్రి మరణించడంతో నగరానికి వచ్చింది. తన వద్ద లేకున్నా ఆమె గర్భం దాల్చిందనే అనుమానంతో కోపోద్రిక్తుడైన అతడు.. మానసను గొంతు నులిమి హత్య చేశాడు.

అనుమానంతో ఒకరు.. ఆగ్రహంతో మరొకరు.. క్షణికావేశంలో ఇంకొకరు.. ఇలా రాష్ట్రంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సొంతు కుమార్తె నుంచి కట్టుకున్న భార్య, కన్నతల్లి ఎవర్నీ వదలడం లేదు. డబ్బు కోసం ఒకరు, కామ వాంఛ తీర్చుకోవడానికి ఇంకొకరు, వివాహేతర సంబంధాలతో, అనుమానంతో కట్టుకున్న భార్యను హతమార్చేందుకు వెనకాడటం లేదు.

ABOUT THE AUTHOR

...view details