Husband murders Wife: అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యను భర్త కడతేర్చిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలో మంగళవారం జరిగింది.
అసలేం జరిగిందంటే...
Husband murders Wife: అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యను భర్త కడతేర్చిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలో మంగళవారం జరిగింది.
అసలేం జరిగిందంటే...
గ్రామానికి చెందిన కాటబోయిన కొండలు, అంజమ్మ దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా వారి కుటుంబంలో ఘర్షణలు జరుగుతున్నాయి. తన భార్య అంజమ్మ ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెంచుకున్న కొండలు తరచూ మద్యం తాగి భార్యను కొడుతూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. మంగళవారం ఉదయం గణపవరంలో ఉన్న పొలం వద్దకు పనిఉందని చెప్పి అంజమ్మను తీసుకెళ్లిన కొండలు పక్కనున్న పంట కాలువలో అంజమ్మను పడేసి గొంతును కాలుతో తొక్కి ఊపిరాడకుండా చేశాడు. దీంతో అంజమ్మ ప్రాణాలు విడిచింది.
గమనించిన చుట్టుపక్కల రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ నరసింహారావు, గ్రామీణ ఎస్సై సాయిప్రశాంత్ ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని కోదాడలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Ganja Seized : రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం