సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్య తరచూ ఫోన్లో మాట్లాడుతుండటం చూసి అనుమానం పెంచుకున్న భర్త... ఆమెను హతమార్చాడు. గ్రామానికి చెందిన స్వప్న, సురేష్ భార్యాభర్తలు. స్వప్న పలుమార్లు ఫోన్లో మాట్లాడటాన్ని గమనించిన సురేష్.. విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలిపాడు.
భార్యపై అనుమానంతో పైపుతో దాడి.. చివరికి మృతి - husband murdered wife in rudraram village
కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. భార్య తరచూ ఫోన్లో మాట్లాడుతోందని ఆవేశంతో ఆమెను విచక్షణారహితంగా కొట్టి చంపాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![భార్యపై అనుమానంతో పైపుతో దాడి.. చివరికి మృతి husband murdered wife](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:22:49:1620265969-11655301-arrest.jpg)
భార్యను చంపిన భర్త
సోమవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆమె ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. తీరు మారకపోయేసరికి ఆగ్రహంతో పైపుతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె తీవ్రంగా గాయపడగా బంధువుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి:మద్యం తాగి రోడుమీదికొచ్చాడు.. ప్రాణాలు కోల్పోయాడు