ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను హత్య చేశాడు. హైకోర్టులో సహాయకుడిగా పనిచేస్తున్న దాసు.. శనివారం రాత్రి మద్యం సేవించి భార్య మౌనికతో ఘర్షణకు దిగాడు.
మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త - husband murdered wife news
హైకోర్టులో సహాయకుడిగా పని చేస్తున్న అతను.. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఫూటుగా మద్యం తాగి... భార్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో భార్యను హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా వెలగపూడిలో జరిగింది.
మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త
మాట మాట పెరిగి టవల్‌తో గాని.. దుప్పటితో గాని మెడకు ఉరేసి హత్య చేసినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు దాసును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:చెరువులోకి దిగి గొర్రెల కాపరి మృతి