ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హొళగుంద ఎస్సీ కాలనీలో.. దంపతుల మధ్య కలహాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. క్షణికావేశంలో భర్త.. భార్యను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హొళగుందకు చెందిన ముత్తమ్మ, మల్లికార్జునలు దంపతులు. పలు కారణాలతో వీరు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా వీరి మధ్య వివాదం జరిగింది.
MURDER: క్షణికావేశంలో భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భర్త - andhra crime
క్షణికావేశంలో మనుషులు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతో మంది అనాథలవుతున్నారు. స్వల్ప వివాదాలకు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో ఇటువంటి ఘటనే జరిగింది. దంపతుల మధ్య నెలకొన్న వివాదంలో కోపోద్రిక్తుడైన భర్త... భార్యను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
క్షణికావేశంలో భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భర్త
ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మల్లికార్జున... భార్యకు ఉరివేశాడు. అనంతరం అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు ఇద్దరు అనాథలుగా మారారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Love Tragedy : ఆమె ప్రేమకు.. రెండు ప్రాణాలు బలి.. మూడు కుటుంబాల్లో విషాదం