తెలంగాణ

telangana

ETV Bharat / crime

husband murdered his wife: కట్టుకున్నవాడే కడతేర్చాడు... కారణం అదేనా..?

భార్య మీద తనకున్న అనుమానమే పెనుభూతమైంది. అది కాస్త అర్ధాంగినే అంతమొందించే స్థాయికి చేరింది (husband murdered his wife). తాను చేసిన కిరాతకాన్ని మూడో కంటికి తెలియకుండా కాలగర్భంలో కప్పిపెట్టేందుకు యత్నించాడు. ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెల్లడైంది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది.

wife murder
wife murder

By

Published : Oct 17, 2021, 6:45 AM IST

అగ్ని సాక్షిగా ఒక్కటైన ఆ జంట పచ్చని సంసారంలో అనుమానం చిచ్చు లేపింది.. కట్టుకున్న భార్యను కిరాతకంగా అంతమొందించి... కప్పిపుచ్చుకునే ప్రయత్నం బెడిసికొట్టింది.. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది (husband murdered his wife). పోలీసుల వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం అప్పాపురానికి చెందిన బుజ్జి(35)కి వట్టిచెరుకూరు మండలం చౌపాడు వాసి కిరణ్‌తో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు.

ఏడాది క్రితం అప్పాపురం వలసొచ్చారు. ఇక్కడే ఉంటూ.. పొలం పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం అంటగట్టి తరచు గొడవపడేవాడు. తాగిన మైకంలో ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు. రెండు పర్యాయాలు కుటుంబ పెద్దలు నచ్చజెప్పారు. ఇదే వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. పెద్దల జోక్యంతో కేసు లేకుండా రాజీ పెట్టినప్పటికీ అతనిలో మార్పురాలేదు. శనివారం ఉదయం వారిద్దరూ కలిసి మిరప పొలంలో పురుగుల మందు వేసేందుకు వెళ్లారు. పెట్రోలు కోసమని మధ్యాహ్నాం ఇంటికొచ్చిన భర్త తిరిగి పొలం వెళ్లాడు. ఇంతలో తన భార్య అపస్మారక స్థితిలో పడిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. విగతజీవిగా మారిన ఆమెను గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు (husband murdered his wife).

రాయితో కొట్టి చంపాడు..

భార్యపై అనుమానంతో పొలంలో మరోసారి గొడవకు దిగిన కిరణ్‌... భార్యను కిరాతకంగా చంపినట్లు మృతురాలి సోదరుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు (husband murdered his wife). చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు, నాదెండ్ల ఎస్సై సతీష్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులను విచారించారు. అనుమానితుడైన భర్త కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైద్య పరీక్షల కోసం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:నిమజ్జనానికి వెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. నలుగురి దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details