కుటుంబ కలహాలతో భార్యను చంపి... తానూ ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. ఈ ఘటన తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో జరిగింది. ఆల్బర్ట్, రేఖ దంపతులకు ఇద్దరు సంతానం. ఆల్బర్ట్ పెయింటింగ్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఆల్బర్ట్ను రేఖ పలుమార్లు మందలించింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య... కొన్ని రోజులుగా కలహాలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి సమయంలో కూడా ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన భర్తపై ఆల్బర్ట్ దాడికి దిగారు. ఈ దాడిలో రేఖ మరణించింది. అనంతరం ఆల్బర్ట్ కూడా ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్యను చంపేసి... తానూ ఆత్మహత్య చేసుకున్నాడు..! - తిరుమలగిరి
చెడు వ్యసనాలకు బానిసైన భర్తను మందలించటమే ఆ భార్యకు శాపమైంది. ఇదే విషయం వారి మధ్య తరచూ కలహాలకు కారణమైంది. ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా గొడవపడ్డారు. కానీ... ప్రతిసారిలాగా ఈసారి వాళ్లు నిద్రపోలేదు. క్షణాకావేశంలో భార్యను శాశ్వతనిద్రలోకి తోసేసి.. తానూ తనువు చాలించాడు.
ఈరోజు ఉదయం వాళ్ల కూతురు తన తల్లికి ఫోన్ చేసింది. స్పందించకపోవటం వల్ల అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూడగా దిగ్భ్రాంతికి గురైంది. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా... తల్లి, తండ్రి విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరేష్ తెలిపారు.