తెలంగాణ

telangana

ETV Bharat / crime

భార్యను కత్తితో నరికిన చంపిన భర్త - Husband kills wife in Kadapa news

భార్యపై అనుమానంతో ఓ భర్త కత్తితో ఆమెని నరికి చంపాడు. ఆ దారుణాన్ని అడ్డుకోబోయిన మరో మహిళపై కత్తితో దాడికి తెగబడ్డాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు పిల్లలకు తల్లిలేకుండా పోయింది.

husband kills his wife, a man murder his wife
భార్యని హతమార్చిన భర్త, భార్యని నరికిన భర్త

By

Published : Apr 11, 2021, 11:55 AM IST

Updated : Apr 11, 2021, 12:25 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప రవీంద్రనగర్‌లో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా నరికి హత్యచేశాడు. అడ్డుకోబోయిన మరో మహిళపైనా దాడి చేశాడు. రవీంద్రనగర్‌కు చెందిన దస్తగిరి, బీబీజాన్‌ దంపతులకు ముగ్గురు సంతానం. ఇటీవలే వారి కుమారుడు మృతిచెందాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న దస్తగిరి... భార్యను వేధించేవాడని మృతురాలి సోదరి తెలిపారు.

ఈ ఉదయం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కత్తితో భార్యపై దాడిచేసిన దస్తగిరి. . దారుణంగా నరికి హతమార్చాడు. అడ్డుకోబోయిన మరదలిపైనా దాడిచేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

అనుమానం పెంచుకున్న దస్తగిరి... డబ్బులు ఇవ్వనందుకే తన అక్కని చంపేశాడని మృతురాలి సోదరి ఆరోపించారు. పిల్లలు ఎలా బతకాలి అని కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చదవండి:వేసవిలో చల్లచల్లని టీలు.. మీకోసమే!

Last Updated : Apr 11, 2021, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details